Salaar | బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ఊచకోత.. తొలిరోజు ‘సలార్’ కలెక్షన్ల సునామీ

-

‘సలార్(Salaar)’ మూవీతో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ బాక్సీఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాడు. తన కటౌట్‌కు సరైన బొమ్మ పడదితే ఎలా ఉంటుందో నిరూపిస్తు్న్నాడు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సలార్ సినిమా మొదటి షోకే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రభాస్(Prabhas) హీరోయిజం వీర లెవల్‌లో ఉండటంతో ఫ్యాన్స్ థియేటర్లకు క్యూకట్టారు. ఈ క్రమంలో తొలి రోజు రికార్డు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అదరగొట్టిన ‘సలార్‌’ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.175కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

- Advertisement -

ఈ చిత్రం(Salaar) ఇండియాలోనే ఓపెనింగ్‌ రోజు రూ.95 కోట్లు సాధించిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా, నైజాంలో సుమారుగా 60 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 15 కోట్ల గ్రాస్, కేరళలో 5 కోట్ల గ్రాస్, తమిళనాడులో 10 కోట్ల గ్రాస్, ఉత్తరాదిలో 30 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంచనా వేశారు. ఇక ఓవర్సీస్‌లోనూ భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఉత్తర అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ డాలర్లు రాబట్టింది. వీకెండ్‌ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also: పిల్లలకు మిల్లెట్స్ ఆహారంగా పెడితే ఏమవుతుంది?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...