మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీలో టికెట్లు మార్పులు చేర్పులపై ఆయన స్పందించారు. జగన్(YS Jagan) విషయంలో ఉండవల్లి వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. జగన్ పై ఆయన చేసే వ్యాఖ్యల పరమార్థం సామాన్యులకు అర్థం కాదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో చెప్పినట్టు మినిమం డిగ్రీ ఉండాల్సిందే. ఎందుకంటే పైకి విమర్శిస్తున్నట్టు అనిపించినా లోతుగా చూస్తే జగన్ కి సూచనలు, సలహాలు ఇస్తున్నట్టే కనిపిస్తుంది. గతంలోనూ జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలపై ఆయన ప్రెస్ మీట్లలో ఉతికారేశారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం మాత్రం నష్టాన్ని పూడ్చుకునేందుకు హింట్లు ఇస్తున్నట్టుగా ఉండేది.
ఇప్పుడు కూడా ఆయన అదే రీతిలో ఎమ్మెల్యే టికెట్ల మార్పులపై స్పందించారు. టికెట్లు కేటాయింపు విషయంలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సూచించారు. టికెట్లు మార్చడం చాలా కష్టమైన వ్యవహారం అని ఆయన(Vundavalli Arun Kumar) అభిప్రాయపడ్డారు. తనను సీఎం చేయాలని సోనియాగాంధీ(Sonia Gandhi) వద్దకు వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన అనుభవమే ఇప్పుడు ఎమ్మెల్యేలలో కూడా కలుగుతుందని అన్నారు. టికెట్లు ఇవ్వని వారి మనసు నొప్పించకుండా కన్విన్స్ చేయాలని సలహా ఇచ్చారు. లేదంటే పార్టీకి కూర్చలేని నష్టం జరిగే అవకాశం ఉందని జగన్ ని హెచ్చరించారు.