నల్గగొండ(Nalgonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు(28) ఆదివారం రాత్రి మిర్యాలగూడ(Miryalaguda) నుంచి పెద్దవూరకు బైక్పై వెళ్తూ సైదులు అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న కేశవులు కుటుంబసభ్యులు ఘటనాస్థలికి ఇవాళ తెల్లవారుజామున టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. అయితే వీరి వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో రమావత్ గన్యా (40), నాగరాజు (28), పాండ్య (40), బుజ్జి (38) చనిపోయారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారికి మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.