గొట్టిపాటి పై ఆశలు పెట్టుకున్న చంద్రబాబు

గొట్టిపాటి పై ఆశలు పెట్టుకున్న చంద్రబాబు

0
83

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు స్ధానాలు గెలుచుకుంది.. 12 స్ధానాలకు గాను టీడీపీ నాలుగు, వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. అయితే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గతంలో వైసీపీలో గెలిచి టీడీపీలోకి చేరి మంత్రి అయ్యారు.. ఇఫ్పుడు కూడా గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఫిరాయిపుల ఎఫెక్ట్ ఆయన పై పడుతుంది అనుకుంటే, ఆయనపై పడలేదు అనే చెప్పాలి.. అయితే కరణం కుటుంబానికి కూడా చంద్రబాబు చీరాల టికెట్ ఇవ్వడంతో ఇక్కడ కేడర్ కలిసి పనిచేసింది.

అయితే గొట్టిపాటి రవికుమార్ కు 1,04,539 ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ తరపున 91,792 ఓట్లు చెంచు గరటయ్యకు వచ్చాయి. ఇక్కడ వైసీపీ ఓటమితో గొట్టిపాటి హవా నడుస్తోంది.. కాని వైసీపీ కూడా ఇక్కడ యాక్టీవ్ గా ఉంది.. అయితే గొట్టిపాటి రవికుమార్ కు గతంలో జగన్ తో మంచి రిలేషన్ ఉంది. దీంతో ఆయనని పార్టీలోకి చేర్చుకుంటారు అని అంటున్నారు. అయితే గొట్టిపాటి పార్టీలో చేరుతారా లేదా అనేది డైలమా అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ మాత్రం గొట్టిపాటి పై ఆశలు పెట్టుకుందట, గతంలో మంత్రి పదవి ఇచ్చాము కాబట్టి ఆయన పార్టీ మారరు అని అంటున్నారు టీడీపీ నేతలు.