జపాన్(Japan)లో వరుస భూకంపాలు ఆ దేశ ప్రజలను వణికిస్తున్నాయి. మరోవైపు సునామీ(Tsunami) హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాలత్లో సముద్రపు అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడుతున్నాయి. అధికారులు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూకంపాల ధాటికి అనేక భవనాలు ఊగడంతో ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. 90 నిమిషాల వ్యవధిలో 21 భూకంపాలు(Earthquake) సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇషిగావాలోని నోటోలో భూకంప కేంద్రం నుండి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జపాన్(Japan)లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ముప్పు ప్రాంతాల్లోని భారతీయుల కోసం కంట్రోలో రూమ్ ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ని విడుదల చేసింది.
ఇటు నేపాల్‌లోనూ 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని ఖాట్మండుకు తూర్పున 56 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.
#BreakingNews: #JAPAN has been hit with massive 7.6 EARTHQUAKE !
Evacuations orders and #tsunami warnings have been issued. pic.twitter.com/xIFi0MGMvb
— Saye Sekhar Angara (@sayesekhar) January 1, 2024