ఏపీలో ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో చేరగా.. బుధవారం వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య(MLC Ramachandraiah) టీడీపీలో చేరారు. చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసిన రామచంద్రయ్య టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా రామచంద్రయ్య(MLC Ramachandraiah) మాట్లాడుతూ.. రాష్ట్రం కోలుకోలేని విధంగా సీఎం జగన్ అప్పులపాలు చేశారని విమర్శించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. తనలాగే వైసీపీలో ఎంతో మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారందరూ త్వరలోనే బయటకు వస్తారని తెలిపారు. టీడీపీ(TDP) పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నానని, చంద్రబాబు సమక్షంలో తిరిగి వైసీపీ నుండి టీడీపీలో చేరడం సొంత గూటికి వచ్చినట్టు ఉందన్నారు. తనకు పదవుల ముఖ్యం కాదని, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని అన్నారు. రాష్ట్ర పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని, చంద్రబాబు అవసరం రాష్ట్రానికి చాలా అవసరం ఉందని రామచంద్రయ్య పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీలోకి తిరిగి స్వాగతం రామచంద్రయ్య గారు
పెద్దాయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించక ఇక వేరే ఆలోచన లేదు..టీడీపీ కుటుంబం..అంతే
కలిసి ఈ అరాచక పాలనని అంతమొందిద్దాం..కడపలో సత్తా చాటుదాం pic.twitter.com/mwgZid70C6
— Venu M Popuri (@Venu4TDP) January 3, 2024
Read Also: రోజుకో ట్విస్ట్.. బ్రదర్ అనిల్‌తో టీడీపీ నేత బీటెక్ రవి భేటీ..