ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి(Dwarakanath Reddy) తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ద్వారకానాథ రెడ్డి దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి స్వయానా మేనమామ కూడా కావడం విశేషం. దీంతో విజయసాయిరెడ్డి దంపతులు మినహా కుటుంబ సభ్యులందరూ టీడీపీలోనే ఉన్నారు.
కాగా 1994లో టీడీపీ నుంచి ద్వారకానాథరెడ్డి(Dwarakanath Reddy) లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఉమ్మడి కడప జిల్లా నియోజకవర్గాల పునర్విభజనలో ఈ రాయచోటి(Rayachoti)లో విలీనమైంది. ఇప్పుడు తిరిగి టీడీపీలో చేరడంతో ఆయనకు రాయచోటి టికెట్ కేటాయించారని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో నెంబర్ టు స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి బంధువులు టీడీపీలో చేరడం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది.