విజయవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఎంపీ కేశినేని నాని(Kesineni Nani), ఆయన కుమార్తె కేశినేని శ్వేత(Kesineni Swetha) వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ నాయకులు కేశినేనితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం ఆ పార్టీ అధినేత సీఎం జగన్‌తో నాని భేటీ కానున్నట్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినేని నానిని బరిలోకి దింపే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్(YS Jagan)ను కలిసిన తర్వాత ఆయన పోటీపై స్పష్టత రానుంది.
కాగా ఇటీవల తాను టీడీపీ(TDP)కి రాజీనామా చేయబోతున్నట్లు నాని ప్రకటించింన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. అనంతరం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు. రెండ్రోజలు క్రితం ఆయన కుమార్తె శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దాంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు.
అయితే కొంతకాలంగా వైసీపీ(YCP) నేతలతో క్లోజ్‌గా ఉంటున్న నాని.. ఆ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. అందుకే చంద్రబాబు నానిని పక్కనపెట్టి ఆయన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ లేదని స్పష్టంచేశారు. దీంతో పార్టీ మారాలని నాని(Kesineni Nani) డిసైడ్ అయ్యారు.