గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram)ను తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. అంతకుముందు మాజీ మంత్రి హరీష్‌రావు, సీపీఎం నేత బీవీ రాఘువులు కూడా ఆయనను పరామర్శించారు. కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఆసుపత్రికి ఎవరూ రావొద్దని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలోని ఆయన నివాసంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ(AIG) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఏఐజి ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు
వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకోని వారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి… pic.twitter.com/PyCff8Rhkj— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 18, 2024