Hyderabad | ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ పై నుంచి వెళ్లిన TS ఆర్టీసీ బస్సు

-

హైదరాబాద్(Hyderabad) సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎర్రగడ్డ(Erragadda) – భరత్ నగర్(Bharat Nagar) ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ వైపు ఇద్దరు మహిళలు స్కూటీ పై ప్రయాణిస్తున్నారు. వీరి వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు మహిళల్లో ఒక మహిళ కింద పడింది. ఆమెపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

- Advertisement -

మరో మహిళకు తీవ్ర గాయాలు అవడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, మృతురాలు శ్రీశైలంకి చెందిన సునీత అనే మహిళగా పోలీసులు గుర్తించారు. ఘటనపై ఆమె కుటుంబసభ్యులకు తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Read Also: తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన ఉపముఖ్యమంత్రి భట్టి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...