ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)కి షాక్ తగిలింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆయనకి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ నెల 23 న ఉరవకొండలో సీఎం పర్యటన ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రికి నిరసన సెగ తగిలింది. అంగన్వాడీలు ఆయన వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. కాన్వాయ్ ముందుకు కదలకుండా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
మంత్రి కాన్వాయ్ ని అడ్డుకుని వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనల నడుమ దాదాపు అరగంటసేపు ఆయన వాహనం అక్కడే నిలిచిపోయింది. మంత్రి కూడా అంతసేపు వాహనంలోనే ఉండిపోయారు. దీంతో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తల్ని పక్కకి లాగేశారు. అనంతరం మంత్రి(Peddireddy) కాన్వాయ్ ని ముందుకి పంపించేశారు.
ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ అడ్డుకున్న అంగన్వాడి కార్యకర్తలు pic.twitter.com/d0KY7InJxv
— Ramesh (@Ramesh07877735) January 20, 2024