Hanuman | దుమ్మరేపిన ‘హనుమాన్’.. తొలి వారం వసూళ్లు ఎంతంటే..?

-

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్(Hanuman)’చిత్రం బ్లాక్‌బాస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి షో నుంచే సూపర్ హిట్ అందుకుని అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా మూవీలోని గ్రాఫిక్స్, విజువల్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. దీంతో థియేటర్లన్ని జైశ్రీరామ్(Jai Sriram) నినాదాలతో మార్మోగాయి. తెలుగుతో పాటు అన్ని భాషల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో మూవీకి ఊహించని కలెక్షన్స్ వస్తున్నాయి.

- Advertisement -

తొలి రోజే ప్రపంవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం(Hanuman) వారం రోజుల వసూళ్లను మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. “తిరుగేని ప్రేమ, ఆతిథ్యంతో హనుమాన్‌ అందనంత ఎత్తులో నిల్చొంది. మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ప్రపంచం నలుమూలలనుంచి మంచి స్పందన వస్తోంది. హనుమాన్‌ను థియేటర్లలో చూడండి”అని ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

కేవలం రూ.30కోట్లతో తీసిన ఈ సినిమా రూ.150కోట్ల వసూలు చేసి రూ.200కోట్ల దిశగా సాగుతోంది. దీంతో చిన్న సినిమాల్లో బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది. అటు అమెరికాలోనూ అదరగొడుతోంది. అక్కడ 2మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. మొత్తానికి చిన్న చిత్రంగా విడుదలైన ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిశోర్‌, సముద్రఖని, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించారు.

Read Also: అయోధ్యలో నిర్మాణమౌతున్న రామయ్య, ఇతర భవ్య మందిర వివరాలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...