ఏదైనా పార్టీలో చేరిన వెంటనే పదవులు రావడం అంటే అది మహాభాగ్యం అనే చెప్పాలి. తాజాగా దేవినేని అవినాష్ తన కేడర్ తో కలిసి వైసీపీలో చేరారు.. జగన్ తో కలిసి భేటీ అయి ఆయన వైసీపీలో చేరారు. జగన్ తో కలిసి పనిచేస్తామని నవరత్నాలు ప్రజలకు నచ్చి ఆయనని సీఎం చేశారు అని , ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలకు తోడు ఉంటాము అని చెప్పారు.
అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకూ గుడివాడ నియోజకవర్గం చూసుకున్న ఆయన ఇక దానికి గుడ్ బై చెప్పారు.. ఇప్పుడు జగన్ ఆయనకు కీలక బాధ్యతలు ఇస్తున్నారు అని సమాచారం. ఎందుకు అంటే జిల్లా రాజకీయాల్లో నెహ్రూ కుటుంబానికి ఒక ప్రత్యేక ముద్ర ఉంది. దేవినేని నెహ్రూ జిల్లా రాజకీయాలను శాసించారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన అవినాశ్ తండ్రి ఇచ్చిన అనుచరగణాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే అనినాష్ కు వెంటనే పదవి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, బొప్పన భవకుమార్‌లు నేతలుగా ఉన్నారు. వారిలో భవ కుమార్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అవినాశ్‌కు తూర్పు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించాలి అని చూస్తున్నారట జగన్.