మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆటోలో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ కి కారులో బయలుదేరారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో యూసఫ్ గూడా నుంచి తెలంగాణ భవన్ కి ఆటోలో వెళ్లారు. అదే సమయంలో ఆటో డ్రైవర్ తో ముచ్చటించారు కేటీఆర్. తెలంగాణ భవన్ చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో తమ వాహనాలు విడిచి ఆటోలో వచ్చామని చెప్పారు కేటీఆర్(KTR). ఆటోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రైవర్ తో మాట్లాడానన్నారు. వారి సమస్యల గురించి, కష్టాల గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారన్నారు. తమకి మద్దతుగా ప్రభుత్వంపై పోరాడాలని ఆటో డ్రైవర్లు కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
BRS party working president K.T. Rama Rao travelled in an auto rickshaw today in Hyderabad.
The former minister is trying to reduce the gap between people and him.#KTRinAuto #BRS #Hyderabad #KTR #Telangana #BRSParty pic.twitter.com/PyePiMTMM7
— Surya Reddy (@jsuryareddy) January 27, 2024