2500 బైక్స్ ఉచితంగా ఇస్తున్న జగన్ ఎవరికి అంటే

2500 బైక్స్ ఉచితంగా ఇస్తున్న జగన్ ఎవరికి అంటే

0
91

ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉచితంగా స్కూటీలు ఇవ్వనుంది. అయితే ఎవరికి ఉచితంగా స్కూటీలు అని అనుకుంటున్నారా, గతంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి స్కూటీలు ఎవరికి ఇవ్వలేదు కదా అని అనుకోకండి, కాని అప్పుడు సర్కారు వేరు ఇఫ్పుడు సర్కారు వేరు. ఇఫ్పుడు జగన్ సర్కారు ఉచితంగా యాక్టీవా బైక్స్ ఇవ్వాలి అని భావిస్తోంది. అది కూడా అందరికి కాదు కొందరికి మాత్రమే.

అయితే ఎవరికి ఉచితంగా బండి ఇస్తారు దీనికి ఏమి కావాలి అంటే. ప్రభుత్వం దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా అంగవైకల్యంతో ఉండి తాము ఏదైనా ఉపాధి చేసుకోవడానికి బండి కావాలి అని అనుకునేవారికి, ఉచితంగా స్కూటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక అంగవైకల్యం ఉన్నవారికి మూడు చక్రాల స్కూటీని ఇవ్వనున్నారు దీని కోసం మీరు అప్లై చేసుకోవచ్చు.

అంగవైకల్యంతో ఉన్నవారు మీ గ్రామ వలంటీర్లకు మీ వివరాలు ఇవ్వాలి. అక్కడ వారు ఇచ్చే ఫామ్ ఫిలప్ చేసి ఇస్తే సరిపోతుంది.. మీపేరు మీ చిరునామా ఫోటో ఆధార్ కార్డ్ అంగవైకల్యానికి సంబధించి సర్టిఫికెట్ ఉంటే పొందుపరచాలి. మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నా దానిని జిరాక్స్ ఇవ్వాలి. వీటిని ఇస్తే మీకు కచ్చితంగా వాలంటీర్లు రసీదు ఇస్తారు.. దీంతో మీ రు అప్లికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అయితే ఈ బైకులని ఇప్పటికే ప్రభుత్వం 2500 మందికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు,. దీని కోసం ప్రస్తుతం 22 కోట్ల రూపాయలు కేటాయించారు.. ఉచితంగా ఎవరికి ఇస్తారు అనేది పంచాయతీ ఆఫీసు్లో వారి లిస్ట్ ఫెడతారు అని తెలుస్తోంది. కాళ్లు సరిగ్గాలేని నడవలేని వారికి ముందు ప్రయారిటీ ఇస్తారట.