దేవినేని అవినాష్ ఎంట్రీపై కొడాలి సంచలన కామెంట్స్

దేవినేని అవినాష్ ఎంట్రీపై కొడాలి సంచలన కామెంట్స్

0
98

మొత్తానికి గుడివాడలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది.. అక్కడ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిపోయారు.. జగన్ ఆయకు కీలక పదవి విజయవాడ తూర్పు బాధ్యతలు ఇస్తారు అని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో ఆయన కొడాలి నాని పై పోటీ చేసి స్టేట్ అంతా ఆయన వైపుచూసేలా చేసుకున్నారు, కావాలనే చంద్రబాబు ఎక్కడా సీటు లేక గుడివాడ సీటు ఇచ్చారు అని ఆయన సన్నిహితులు దేవినేని అభిమానుల కూడా అప్పుడు అసహనం వ్యక్తం చేశారు.. ఎందుకు అంటే కొడాలి నాని గుడివాడలో స్టేట్ లీడర్ గా సీనియర్ గా ఉన్నారు.. కాబట్టి అక్కడ దేవినేని గెలవలేడు అనే ఆలోచన అందరికి వచ్చింది, చివరకు అదే జరిగింది.

మరి తాజాగా కొడాలి నాని దీనిపై మాట్లాడారు బాబు కావాలనే దేవినేని అవినాష్ ని ఇరికించాడని, రాజకీయంగా బలిపశువుని చేసిన ఘనత చంద్రబాబుకి వస్తుంది అని అన్నారు.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు బాబు పరిస్దితి చూసి వైసీపీలో చేరుతున్నారు అని విమర్శించారు.. టీడీపీ నేతలు ఇసుక దోచుకున్నారు అని ఇది ప్రజలకు తెలుసు అని అన్నారు.. త్వరలో టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుంది అని తెలియచేశారాయన. ఇక వైసీపీ నేతలపై నిందలు ఆరోపణలు ఆపాలని, టీడీపీని కాపాడే నాధుడు లేడు అని విమర్శించారు నాని.