తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళ్ సై(Governor Tamilisai) ప్రసంగం కొనసాగుతోంది. కాళోజీ కవితతో తెలుగులో గవర్నర్ స్పీచ్ ప్రారంభించారు. ప్రజలు తమ ఆకాంక్షలు ప్రతిబింబించేలా నిజమైన స్వాతంత్రం ప్రజాస్వామ్యం గల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆమె అన్నారు. ఒకప్పుడు ప్రజాభవన్(Praja Bhavan) కి అనుమతి లేదని.. ఇప్పుడు ఆ కంచెలు తొలగించాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం లభించిందన్నారు.
మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme)తో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని.. కచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, యువతకు రెండు లక్షల ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించామని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మాకు అప్పగించారని గత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. పదేళ్ల కాలంలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఆర్థిక వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని అన్నారు. గత పాలకుల హయాంలో నష్టపోయిన సంస్థల్ని కోరుకునేలా చేస్తామని, మౌలిక వసతుల్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేందుకు కృషి చేస్తామన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai).