ఎన్నికల వేళ వైసీపీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ ఎమెల్సీ జంగా కృష్ణమూర్తి (Janga Krishna Murthy) సీఎం జగన్‌పై ధిక్కార స్వరం వినిపించారు. సీఎం జగన్(CM Jagan) ఒంటెద్దు పోకడ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం జగన్‌ను ఓట్లు వేసి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
“వైసీపీలో పవర్ కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఉంది. ఆ పార్టీలో బీసీలు అవమానాలకు గురవుతున్నారు. బీసీలది ఆత్మగౌరవ పోరాటం. పార్టీలో జగన్ ఒంటెద్దు పోకడ చాలా బాగా కనిపిస్తోంది. ప్రభుత్వం బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన సామాజిక న్యాయం చేయలేదు. బీసీలకు తాత్కాలిక పదవులిచ్చారు కానీ వాటికి పవర్ లేదు. అధికారమం అంతా కొద్ది మంది దగ్గరే పెట్టుకున్నారు. పార్టీలో బీసీలకు సరైన గౌరవం, స్వేచ్ఛ, కేటాయించిన అధికారం లేక ఎంతో మంది బీసీలు వైసీపీకి దూరం అవుతున్నారు. ఈ విషయంలో వైసీపీ పునరాలోచించుకోవాలి. వైసీపీ స్థాపించిన నాటి నుంచి కూడా జగన్‌ను సీఎం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఆయన విజయంలో నేను(Janga Krishna Murthy) కూడా భాగస్వాముడిని అయ్యాను. కానీ ఈ రోజు రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉంది” అని తీవ్రంగా విరుచుకుపడ్డారు.
In a surprising & intriguing development ruling @YSRCParty’s BC face & it’s Bc wing president MLC Janga Krishna Murthy lashed out at the party & @ysjagan. He has been a trusted lieutenant of @ysjagan since @YSRCParty’s inception. Learnt he has been seeking @YSRCParty ticket from… pic.twitter.com/aFOY3Kox71
— SNV Sudhir (@sudhirjourno) February 12, 2024