Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం.. రేవంత్ వర్సెస్ హరీష్..

-

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు వాడివేడి సాగుతున్నాయి. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ “మహబూబ్ నగర్ జిల్లా నుంచి 10 లక్షల మందిపైగా వలస వెళ్లారు. 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరిమితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యోపాపని ఆదరించి ఎంపీగా గెలిపించారు. ఇవాళ ఆ జిల్లాకు సంబంధించిన కీలక చర్చ జరుగుతుంటే శాసనసభకు రాకుండా ఫాంహౌస్ పడుకుని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా? ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నపుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సాగునీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పేది లేదు” పేర్కొన్నారు.

- Advertisement -

“ఇలాంటి సందర్భంలో సభకు రాకుండా ఫాంహౌస్ లో దాక్కుని ప్రజలను తప్పుదోవ పట్టించడానికే హ‌రీశ్‌రావును పంపించారు. మొన్న నేను చూసినప్పుడు ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంది. ఈరోజు ఆ కుర్చీలో పద్మారావు కూర్చున్నారు. కనీసం ఆయనకైనా ప్రతిపక్ష నేత బాధ్యత ఇస్తే సమర్థవంతంగా నెరవేరుస్తారు. పద్మారావు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. ఆయనలాంటి వారిని విపక్ష నేతగా పెడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ప్రాజెక్టులపై మేము పెట్టిన తీర్మానానికి అనుకులామా, వ్యతిరేకమా అనేది బీఆర్ఎస్(BRS) స్పష్టం చేయాలని” వెల్లడించారు.

Telangana Assembly | సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు(Harish Rao) కౌంటర్ ఇచ్చారు. “కేసీఆర్(KCR) ను కరీంగనర్ నుంచి తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని ఈయనగారు అన్నారు. కేసీఆర్ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడు. సిద్ధిపేట, గజ్వేల్, కరీంనగర్, మ‌హబూబ్‌న‌గ‌ర్‌.. ఎక్కడా ఓడిపోలేదు. మరి నిన్ను కొడంగల్ నుంచి తరిమితే మ‌ల్కాజ్‌గిరికి వచ్చావా? నువ్వెందుకొచ్చావ్ మ‌ల్కాజ్‌గిరికి? ఒక వేలు మావైపు చూపిస్తే.. రెండు వేళ్లు మీవైపు చూపిస్తాయి. మేము మీ కంటే దీటుగా, ఘాటుగా సమాధానం చెప్పగలమని” తెలిపారు.

Read Also: గన్ కల్చర్ కు ట్రంప్ మద్దతు.. NRA సమావేశంలో కీలక హామీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....