YS Sharmila | తిరుపతిలో ప్రత్యేక హోదా డిక్లరేషన్ పై షర్మిల కీలక వ్యాఖ్యలు

-

ప్రత్యేక హోదా డిక్లరేషన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి ఒకటో తేదిన తిరుపతిలో నిర్వహించబోయే సభలో హోదాపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుందని ఆమె వెల్లడించారు.

- Advertisement -

“మహానేత YSR సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.. రాష్ట్ర అభివృద్ధికి సైతం అంతే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన అడుగుజాడల్లోనే అనంతపురం సభలో సంక్షేమంపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ .. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి హోదాపై కీలక డిక్లరేషన్ చేయబోతుంది. మార్చి ఒకటిన తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ చేయబోతున్నాం. ప్రధానమంత్రి హోదాలో మోదీ మాట ఇచ్చిన తిరుపతిలో అదే మైదానంలో హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ చేస్తుంది.

ప్రత్యేక హోదా అవసరం గురించి రాష్ట్రంలో అందరికీ తెలిసినా ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడవు. గత ఎన్నికలలో హోదాను రాజకీయ ప్రచారం కోసం వాడుకుని అధికారంలోకి వచ్చారు.పదవొచ్చాక పోరాటం చేయడం మరిచారు. చంద్రబాబు, జగన్‌లు మాత్రం మోదీకి బానిసలుగా మారారు.ఈ పదేళ్లలో హోదాపై నిజమైన ఉద్యమం చేసిన వారే లేరు. వీరిని ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి?” అని ఆమె తెలిపారు.

“ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా.. గత ఎన్నికల్లో 1.18 శాతం ఓటు షేరు ఉన్నా.. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది కనుకనే నేను చేరాను. ఆ మూడు పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీలు, విశాఖ ఉక్కు, రాజధాని కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఉత్తరాఖండ్‌లో ప్రత్యేక హోదా కారణంగా 2000 పరిశ్రమలు వచ్చాయి. 972 కిలోమీట్ల సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రంలో పది పరిశ్రమలు కూడా రాలేదు. ఇలాగే కొనసాగితే యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది. ఏపీపీఎస్సీ ద్వారా మూడు వేలు కూడా లేవు. ఏపీలో ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం అన్నారు.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు’’ షర్మిల విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...