అధికార వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) టీడీపీలో చేరారు. కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు(Chandrababu) ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నదే తన కోరిక అని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే చేస్తే.. లేదంటే పార్టీ కోసం పనిచేస్తానన్నారు. ఏపీ అభివృద్ధి పథంలో సాగాలంటే చంద్రబాబే సీఎం కావాలని.. ఆయన నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. వైసీపీలో తనకు ప్రాధాన్యత లభించలేదని వాపోయారు. నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని సీఎం జగన్‌కు వినతులు ఇచ్చినా.. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆయన(Vasantha Krishna Prasad) విమర్శించారు.