వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆ రాజుగారికి ఎప్పుడూ అమితమైన ప్రేమ ఉంది. జగన్ సీఎం అవుతారు అని ముందు నుంచి అనుకున్నారు. అసెంబ్లీలో కూడా పలు విషయాలలో జగన్ పై విమర్శలు చేశారు. జగన్ పై ప్రశంసలు చేశారు.. ఫిరాయింపులకు ఆయన వ్యతిరేకం. ఆయనే బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. మరి జగన్ పై తాజాగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెబితే పిల్లల జీవితాలు బాగుంటాయి అని ఆయన సపోర్ట్ చేశారు. అలాగే కన్న కామెంట్స్ పై నో కామెంట్ అన్నారు.
అయితే ఆయన సీఎం జగన్ ని కలవడానికి ఆరుసార్లు అపాయింట్మెంట్ కోరాను అని చెప్పారు.. ఈ సమయంలో జగన్ ఆయనకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. గతంలో జగన్ కు సపోర్ట్ గా అసెంబ్లీలో ఫిరాయింపుల గురించి కూడా తమ వాదన వినిపించేవారు.ఆయన బీజేపీ నుంచి వైసీపీలోకి వస్తారు అని వార్తలు వచ్చాయి.. కాని ఆయన బీజేపీలోని కొనసాగి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మరి అలాంటి విమర్శలకు దూరంగా ఉండే రాజుగారికి ఎందుకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే దీని వెనుక పెద్ద స్టోరీ ఉందట, బీజేపీతో జగన్ సయోధ్యగా ఉంటున్నారు.. ఈ సమయంలో బీజేపీ నేతలతో జగన్ కలిస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది అని బీజేపీ నేతలు, ఎవరినీ జగన్ పెద్దగా కలవడం లేదట. అది దీని వెనుక కారణం అంటున్నారు కొందరు మేధావులు.