తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీని నిత్యం టార్గెట్ చేసేవారు.. ఆరోజుల్లో జగన్ సామాజిక వర్గం చేత జగన్ పై నిత్యం విమర్శలు చేయించేవారు.. సోమిరెడ్డి ఆదినారాయ రెడ్డి జేసి దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా వీరంతా నిత్యం విమర్శలు చేసేవారు.. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములా జగన్ వాడుతున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జగన్ పై తీవ్ర స్ధాయిలో సాక్షి ముందు కూర్చుని జేసి ప్రభాకర్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేశారో తెలిసిందే. ఇక ఆదినారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మంత్రులుగా ఉండి తీవ్రస్దాయిలో విమర్శలు చేశారు.
అయితే సేమ్ సీన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది. ఇటీవల వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసి రెండు రోజుల క్రితం దారుణంగా చంద్రబాబు లోకేష్ పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు.. అలాగే మరో నాయకుడు దేవినేని అవినాష్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలా సొంత సామాజిక వర్గం నేతలని పార్టీలో చేర్చుకుని బాబు గతంతో చేసింది తిరిగి రిటర్న్ గిప్ట్ గా జగన్ ఇస్తున్నారు అనే టాక్ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. అంతేకాదు జగన్ కూడా ఈ జిల్లాలో వైసీపీకి తిరుగులేకుండా చేసేందుకు కమ్మ సామాజిక వర్గం నేతలను పార్టీలోకి ఆహ్వనిస్తున్నారు అని టాక్ అయితే నడుస్తోంది.