MLC Kavitha | కోర్టులో ఎమ్మెల్సీ కవితకి మరో షాక్

-

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి కోర్టులో షాక్ తగలింది. ఆమె కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఆమెను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని.. మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని తెలియజేశారు. ప్రస్తుతం క‌విత బంధువుల ఇంట్లో సోదాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది.

- Advertisement -

వాదనలు ముగిసిన అనంతరం మరో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కోర్టులోకి వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. గతంలో అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారని వెల్లడించారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం విధితమే. ఇప్పుడు కవిత కస్టడీ కూడా పొడిగించిన నేపథ్యంలో ఇద్దరిని కలిపి విచారించే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...