Mahasena Rajesh: పి.గన్నవరం నియోజకవర్గం జనసేనదే.. మహాసేన రాజేష్‌కు భారీ షాక్.. 

-

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన పి.గన్నవరం నియోజవర్గం జనసేనకు వెళ్లిపోయింది. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నియోజకవర్గ నేతలతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందజేశారు.

- Advertisement -

అనంతరం పవన్ మాట్లాడుతూ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలి. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసేనదే. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దశదిశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే’ అని పవన్ తెలిపారు.

కాగా తొలి జాబితాలో పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా సరిపెళ్ల రాజేష్‌ అలియాస్ మహాసేన రాజేష్‌ను చంద్రబాబు ప్రకటించారు. అయితే బ్రాహ్మణులు, హిందువులకు వ్యతిరేకంగా గతంలో అతడు చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిరసనలు ఎక్కువ కావటంతో రాజేష్ క్షమాపణలు చెబుతూ తన వల్ల పార్టీకి ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే పోటీ నుంచి తప్పుకుంటానంటూ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో పి. గన్నవరం టికెట్‌ జనసేనకు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...