కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటిని పవన్ అద్దెకు తీసుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న ఈ భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు ఈ మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో దీనిని ఎంపిక చేశారు. ఉగాది పండుగ నుంచి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకునే వరకు పవన్ ఇక్కడే ఉండనున్నారు.
ఇక వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఈ నెల 7న అనకాపల్లి, 8న ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పర్యటిస్తారని పార్టీ కార్యాలయం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉగాది పండుగ పురస్కరించుకుని ఏప్రిల్ 9న పిఠాపురం నియోజకవర్గంలో జరిగే వేడుకల్లో పవన్(Pawan Kalyan) పాల్గొంటారు. జ్వరం కారణంగా పవన్ ప్రచార కార్యక్రమానికి మూడు రోజుల విరామం ప్రకటించారు. ఆదివారం నుంచి యథావిధిగా ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తారని పార్టీ తెలిపింది. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ త్వరలో ఖరారు చేయనున్నట్లు పేర్కొంది.
#Pawan_Kalyan Sir Follower Made His New House & One Floor is Fully Dedicated to #JanaSenaParty 😍❤️ pic.twitter.com/EvcldLdexK
— Sunkara Siva prasad (@SunkaraSivapra3) January 21, 2023