దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు(Thota Trimurthulu) 18 నెలల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు నిందితులకు కూడా ఇదే శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
1996లో డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో తోట త్రిమూర్తులు ఐదుగురు దళితులను తీవ్రంగా హింసించారు. ఇందులో ఇద్దరు యువకులకు శిరోముండనం చేసి అవమానించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో త్రిమూర్తులు మూడు నెలలు జైలులో కూడా ఉండి వచ్చారు. అప్పటి నుంచీ ఈ కేసు పలు కోర్టుల్లో విచారణ జరుగుతూనే ఉంది.
దాదాపు 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. ఈ విచారణలో త్రిమూర్తులతో(Thota Trimurthulu) పాటు మరో 5 మందిని దోషులుగా గుర్తిస్తూ కోర్టు శిక్ష విధించింది. ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. కాగా న్యాయస్థానం తీర్పు పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: జనసేన పార్టీకి హైకోర్టులో భారీ ఊరట
Follow us on: Google News, Koo, Twitter, ShareChat