ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున తన వాయిస్ ను గట్టిగా వినిపించిన మహిళా నేత యామిని… వైసీపీ నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తే వారికి వెంటనే కౌంటర్ ఇచ్చేవారు యామని…
అయితే ఈ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో ఇటీవలే టీడీపీకి వీడ్కోలు చెప్పారు… దీంతో ప్రస్తుతం ఆమె బీజేపీలో చేరుతారని అంటున్నారు… మరికొందరు వైసీపీలో చేరుతారని అంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…
తాను వైసీపీలో వెళ్లేందుకు ప్రయత్నించానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు… అలా అంటున్న వారిని నా ముందు తీసుకురాగలరా వాళ్ల ముఖాన్ని తాను చూస్తానని అన్నారు… తాను ప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ తలపులు మూసిందన్న వార్తల్లో నిజం లేదని అన్నారు యామిని…