Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

-

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శ్రుతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్ లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మొదటి స్థానంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు నిలవగా.. సెకండ్ ఇయర్‌లో మొదటి స్థానంలో ములుగు జిల్లా నిలిచింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.

- Advertisement -

ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. ఇక వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.inలో చేక్ చేసుకోవచ్చు. అలాగే రీ కౌంటింగ్, పేపర్ రీ వాల్యూయేషన్ కోసం ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు అవకాశం ఉంది. సప్లమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభంకానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...