ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. ‘పుష్ప2(Pushpa 2)’ మూవీ ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే లిరికల్ సాంగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ మాస్ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఈ పాటకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రపాద్ అందించిన బాణీలు అదిరిపోయాయి. దీంతో సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అభిమానులకు పూనకాలు తెప్పించగా.. ఇప్పుడు లిరికల్ సాంగ్ కూడా అదరగొడుతోంది.
ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్‌లో గంగమ్మ జాతరలో అల్లు అర్జున్(Allu Arjun) అమ్మవారిలా ఉగ్రరూపంతో చేస్తున్న ఫైట్ అదిరిపోయింది. ఇక ఈ మూవీలో జరిగే గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ అమ్మోరు అవతారంలో నాట్యం చేయనున్నారట. అలాగే అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందని.. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే సుకుమార్ చాలా ఖర్చు చేసి తెరకెక్కించారట.
Pushpa 2 | కాగా ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్‍గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‍గా చేస్తున్నాడు. వీరితో పాటు జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రామేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న మూవీని రిలీజ్ చేయనున్నారు.