సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

-

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు బుధవారం జైలులో సూసైడ్ చేసుకున్నాడు. నిందితుల్లో ఒకరైన అనూజ్ థావన్ (32) పోలీసు కస్టడీలో ఉండగా ఆత్మహత్యకి పాల్పడ్డాడు.

- Advertisement -

కాగా, ఏప్రిల్ 14 తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి బయటు కాల్పులు జరిపారు. సల్మాన్ ఖాన్ నివసిస్తున్న బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్దకి బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులోకి దూసుకుపోయింది. సల్మాన్ ఖాన్ ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ కాల్పులు జరిగాయి. కాల్పులకు పాల్పడ్డ విక్కీ గుప్తా, సాగర్ పాల్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి ఆయుధాలు సమకూర్చాడనే ఆరోపణల నేపథ్యంలో అనూజ్ థాపన్ నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేయగా.. అతను బుధవారం జైలులోనే సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...