తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9వ తేదీ లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తామని వెల్లడించారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రకటన పూర్తిగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఉందని వేణుకుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ(Election Commission).. నిబంధనలు ఉల్లంఘించినట్లుగా నిర్ధారించింది.
దీంతో నిధుల విడుదలకు బ్రేక్ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే పంపిణీ చేయాలంటూ ఆదేశించింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తితో ఇటీవల రైతు భరోసా(Rythu Bharosa) నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వం వెంటనే ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.