AP Cabinet: కూటమి ప్రభుత్వంలో కొత్త ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ 

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. సామాజిక సమన్యాయాన్ని పాటిస్తూ మంత్రివర్గం కూర్పయింది. మంగళవారం అర్ధరాత్రి మంత్రులను నిర్ణయిస్తూ కూటమి నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు కొత్తగా గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ దక్కింది. ఈసారి కూటమి క్యాబినెట్ లో పదిమంది కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు.

- Advertisement -

ఏపీ కేబినెట్:

1.నారా చంద్రబాబు నాయుడు

2.కొణిదెల పవన్ కళ్యాణ్

3.కింజరాపు అచ్చెన్నాయుడు

4.కొల్లు రవీంద్ర

5.నాదెండ్ల మనోహర్

6.పి.నారాయణ

7.వంగలపూడి అనిత

8.సత్యకుమార్ యాదవ్

9.నిమ్మల రామానాయుడు

10.ఎన్.ఎమ్.డి.ఫరూక్

11.ఆనం రామనారాయణరెడ్డి

12.పయ్యావుల కేశవ్

13.అనగాని సత్యప్రసాద్

14.కొలుసు పార్థసారధి

15.డోలా బాలవీరాంజనేయస్వామి

16.గొట్టిపాటి రవి

17.కందుల దుర్గేష్

18.గుమ్మడి సంధ్యారాణి

19.బీసీ జనార్థన్ రెడ్డి

20.టీజీ భరత్

21.ఎస్.సవిత

22.వాసంశెట్టి సుభాష్

23.కొండపల్లి శ్రీనివాస్

24.మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

25.నారా లోకేష్

తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి…

పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి లు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు. వీరందరూ ఇప్పుడు కూటమి క్యాబినెట్ లో అడుగుపెట్టనున్నారు.

గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచి…

పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

గతంలో మంత్రులుగా…

అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రాంనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారధి లు గతంలో మంత్రులుగా పనిచేశారు.

మంత్రివర్గం సామాజిక సమీకరణాలు.. 

ఎస్సీ మాల

డోలా బాల వీరాంజనేయ స్వామి.

ఎస్సీ మాదిగ

వంగలపూడి అనిత

ఎస్టీ

గుమ్మడి సంధ్యారాణి

ముస్లిం మైనారిటీ

ఎన్.ఎమ్.డి.ఫరూక్

ఆర్య వైశ్య

టీజీ భరత్

రెడ్డి

ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

కాపు

పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్

బలిజ

పి.నారాయణ

కమ్మ

నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ (జనసేన), పయ్యావుల కేశవ, గొట్టిపాటి రవి

బీసీ, యాదవ

కొలుసు పార్థసారథి, సత్యకుమార్ (బీజేపీ)

బీసీ, మత్స్యకార

కొల్లు రవీంద్ర

బీసీ, తూర్పు కాపు

కే శ్రీనివాస్

బీసీ, కొప్పుల వెలమ

అచ్చెన్నాయుడు

బీసీ, గౌడ

అనగాని సత్యప్రసాద్

బీసీ, శెట్టిబలిజ

వాసంశెట్టి సుభాష్

కురబ

ఎస్. సవిత

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...