‘ఏలియన్స్ అంటే కోహ్లీకి పిచ్చి’

-

Dinesh Karthik – Virat Kohli |గ్రహాంతవాసులు అదే ఏలియన్స్ అంటే అధికాశతం మంది ప్రజలు ఆసక్తి చూపుతారు. కానీ ఆ ఆసక్తి సదరు విషయం గురించి ఎవరైనా చెప్తే అంతవరకు వినడమే తప్ప రీసెర్చ్ చేయడం అనేది చాలా తక్కువ. అలాంటి అతి తక్కువ వారిలో కోహ్లీ ఒకడని అతడి బెస్ట్ ఫ్రెండ్ దినేష్ కార్తీక్ చెప్పాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దినేష్ ఈ ఇంట్రస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు. గ్రహాంతరవాసులు అంటే కోహ్లీ ఎక్కడలేని ఆసక్తి చూపుతాడని వివరించాడు. అందరూ కింగ్ కోహ్లీనే చూస్తారు కానీ.. చాలా సన్నిహితంగా ఉండే వారే కిడ్ కోహ్లీని కూడా చూస్తారని, అలాంటి ఒక టైమ్‌లోనే ఏలియన్స్‌ గురించి కోహ్లీ ఏమనుకుంటాడో తనకు అర్థమయిందని దినేష్ చెప్పాడు.

- Advertisement -

‘‘నాకు గ్రహాంతవాసులు అంటే పెద్దగా నమ్మకం లేదు. ఏలియన్స్(Aliens) గురించి పెద్దగా నాకేమీ తెలియదు కూడా. అయితే క్రికెటర్స్‌లో ఏలియన్స్ అంటే ఎవరికి ఎక్కువ ఆసక్తో చెప్తే మీరు అవాక్కవుతారు. అతడు ఎవరో కాదు అందరూ ముద్దుగా కింగ్ అని పిలుచుకునే కోహ్లీ. అమెరికాలో ఎక్కడో ఒకచోట ఏలియన్స్ కనిపించాయంటూ ఒకసారి కోహ్లీ నాకో యూట్యూబ్ వీడియో చూపించాడు. ఆ తర్వాత ఏలియన్స్ గురించి చాలా సేపు మాట్లాడాడు కూడా. నేను పెద్దగా పట్టించుకోని విషయం కావడంతో నాకు ఆ విషయాలు గుర్తులేవు. కానీ.. ఏలియన్స్ అంటే కోహ్లీకి ఎక్కడలేని ఆసక్తి. మరోమాటలో చెప్పాలంటే ఏలియన్స్ గురించి తెలుసుకోవడం అంటే పిచ్చి’’ అని దినేష్ చెప్పాడు.

ఇదిలా ఉంటే దినేష్, కోహ్లీ చాలా కాలం పాటు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తరపున ఆడారు. ఆ సమయంలో వీరిద్దరు మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయారు. 2024 ఐపీఎల్ టోర్నీలో కూడా వీరిద్దరు కలిసి ఆర్‌సీబీని ఎలిమినేటర్ వరకు తీసుకెళ్లారు. కానీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆర్‌సీబీ ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత తాను ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు దినేష్(Dinesh Karthik) ప్రకటించాడు. దీంతో 2025 ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా దినేష్ వ్యవహరించనున్నాడు.

Read Also: గంభీర్‌తో గొడవలపై బీసీసీఐకి కోహ్లీ హామీ.. ఏమనంటే..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బ్యాండేజీతోనే బౌలింగ్ చేస్తున్న షమీ.. ఎందుకోసమో..!

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Shami).. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాండేజీతోనే...

క్వార్టర్స్‌లోకి సింధు ఎంట్రీ.. చైనాను చిత్తు చేసి మరీ..

ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV...