ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ వల్లనో, అధిక ప్రయాణాల వల్లనో యువతలో చాలా మందిని బాధిస్తున్న సమస్య నడుము నొప్పి. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లను మార్చినా తగ్గినట్టే తగ్గి కొన్ని రోజులకే మళ్లీ తిరగబెడుతుంటుంది. ఇలాంటి మొండి నడుము నొప్పి(Waist Pain)కి ఒకే మార్గం ఉంది. అదే వ్యాయామం. ఇప్పటికే నడుము నొప్పి వచ్చేసి ఉంటే.. డాక్టర్ను సంప్రదించాలని, మందులు వాడటంతో నొడుము నొప్పి తగ్గిన వెంటనే వ్యాయామం ప్రారంభించడంతో మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నొప్పి ఉంటుంది కదా అని ఎక్కువ సేపు పడుకుని ఉంటే అది తీవ్ర సమ్యలకు దారి తీస్తుందని, ఎక్కువ సేపు పడుకునే ఉండటం వల్ల వెన్నెముక భాగానికి అంటుకొని ఉండే కండరాలు బలహీనపడి మరెన్నో సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి ముందుగా నడకను ప్రారంభించాలి. నడక వెన్నుకు రెండువైపులా ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది. అదే విధంగా వైద్యుల సహాయంతో కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా, ప్రతిరోజూ యోగా చేయడం వల్ల నడుము నొప్పి(Waist Pain) నుంచి బయటపడొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామాన్ని మన జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా ప్రయాణాలు, పనిగంటల్లో ప్రశాంతంగా ఉండొచ్చని అంటున్నారు.