తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు జగన్(YS Jagan) అంటూ ఆంధ్ర హోం మంత్రి వంగలపుడి అనిత(Vangalapudi Anitha) నిలదీశారు. ప్రభుత్వంపై బురదజల్లడమే పరమావధిగా జగన్ ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ‘‘రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి. వాటిలో ముగ్గురు మృతులు టీడీపీ కార్యకర్తలే. కానీ 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్ ఆరోపిస్తున్నారు. వాటికి సంబంధించిన సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు అందించాలి. లేనిపక్షంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు. ఇప్పటికి కూడా ప్రజలు మీ మాటలు నమ్ముతారని ఎలా అనుకుంటున్నారు’’ అని ఆమె ప్రశ్నలు గుప్పించారు.
వైసీపీ హయాంలో వారు పాల్పడిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదని, కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కేసులు బనాయించి వేధించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల కారణంగా ఎంతోమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారామే. అధికారం పోవడంతో నెలరోజుల్లోనే జగన్ దిమ్మతిరిగి పోయిందని, అందుకే మైండ్ పనిచేయనట్లు ఆయన మాట్లాడుతున్నారని ఆమె(Vangalapudi Anitha) చురకలంటించారు.