ఇన్‌స్టా డీయాక్టివేట్‌కు అసలు కారణం చెప్పిన విశ్వక్..

-

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన తాజాగా సినిమా ‘మెకానిక్ రాకీ(Mechanic Rocky)’. ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే విశ్వక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశాడు. దీంతో దీని వెనక ఎవరో నటి పాత్ర ఉందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు. ఓ విలేకరి ఇదే ప్రశ్న అడగ్గా దానికి సూటిగా బదులిచ్చారు మన యంగ్ హీరో. తన ఇన్‌స్టా డీయాక్టివేట్ వెనక ఏ నటి హస్తం లేదని స్పష్టం చేశాడు.

- Advertisement -

ఇన్‌స్టాను ఏ నటి వల్లో డీయాక్ట్‌వేట్ చేయలేదు. నేను ఇన్‌స్టాలో ఉండేది అభిమానుల కోసమే. అయినా దానిని డీయాక్టివేట్ చేయడానికి ప్రధాన కారణం ఉంది. మార్చి 29 నాటికి నా వయసు 30 ఏళ్లు అయింది. ఈ విషయాన్ని ఇటీవలే గుర్తించా. ఈ వయసులో కూడా ఫోన్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయించడం నచ్చలేదు. ఫోన్ పక్కనపెట్టి.. పనిపై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యా. అందుకే ఇన్‌స్టాను డీయాక్టివేట్ చేశా. దీనిని మళ్ళీ సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు యాక్టివేట్ చేసి సినిమా విడుదలైన వారం తర్వాత డీయాక్టివేట్ చేసేస్తా’’ అని Vishwak Sen చెప్పాడు.

Read Also: ప్యారిస్ ఒలిపింక్స్‌లో సత్తా చాటిన మను భాకర్.. తొలి మహిళగా రికార్డ్..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...