అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు పరిచయం అక్కర్లేని వ్యక్తి… తాజాగా ఆయన తన రూట్ మార్చారు… ఇటీవలే కాలంలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన జేసీ ఇప్పుడు తమ రూట్ ను మార్చారు…
తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు మా వాడేనని అన్నారు… ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ జగన్ మాత్రం మావాడేనని అన్నారు…
ఎన్నికల సమయంలో తనను వైసీపీలో చేర్చుకునేందుకు చాలా ట్రై చేశారని అన్నారు.. అయితే తనకు పార్టీలో సరైన గౌరవం లభించదనే ఉద్దేశంతో తాను పార్టీలో చేరలేదని అన్నారు జేసీ … రాజశేఖర్ రెడ్డి దగ్గర ఆప్యాయత అనురాగం ఉండేదని జగన్ దగ్గర ఇది తక్కువ అని అన్నారు…