నటికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసిన నటుడు

నటికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసిన నటుడు

0
105

మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి… తాజాగా హర్యానాలో ఓ టీవీ నటికి జూనియర్ ఆర్టిస్ట్ డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…. పలు రియాల్టీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయిన ఆ నటికి జూనియర్ ఆర్టిస్ట్ పరిచయం అయ్యాడు..

దీంతో వీరిద్దరు కలిసి పలు షోలకు ప్రదర్శలు చేశారు… ఇంతలో జూనియర్ ఆర్టిస్ట్ ఆ నటిపై కన్నేశాడు… ప్లాన్ ప్రకారం గత నెల 13న పార్టీ ఉందని ఓ హోటల్ కు పిలిపించుకున్నాడు… అమెకు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చాడు… దీంతో మత్తులోకి జారుకున్న ఆమెపై జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారం చేశాడు..

ప్రస్తుతం తాను గర్భవతినని పెళ్లి చేసుకోవాలని అడిగింది… దీనికి జూనియర్ ఆర్టిస్ట్ నిరాకరించడంతో విషయం తన తల్లి దండ్రులకు చెప్పింది… వారుకూడా పట్టించుకోకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…