ఏపీలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. కానీ ఇసుక మాఫీయా మాత్రం ఆకాశమే హద్దులా విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశగా అధికారులతో చర్చల జరుపుతూ.. ఎప్పటికప్పుడు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలోనే ఒకసారి ఇసుక అక్రమ రావాణాదారులను హెచ్చరించిన టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్(JC Prabhakar Reddy).. ఈరోజు వాళ్లని ఉద్దేశించి మరోసారి వార్నింగ్స్ ఇచ్చారు. ఇసుక అక్రమ రవాణా దారులను తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో విడిచి పెట్టదని అన్నారు. వారికి ఇదే లాస్ట్ వార్నింగ్ అని, వాళ్లు ఇప్పటికైనా అక్రమ రవాణా మానుకుంటే బాగుంటుందని అన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సమీపంలోని పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుందని జేసీ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి కట్టడానికి చెందిన 25 మంది వ్యక్తులు పెన్నా నది నుండి అక్రమ రవాణా చేస్తున్నారని, ఇప్పటికైనా వారు ఇటువంటి పని మానుకోవాలని ఇప్పటికే ఏసీబీ అధికారులు అక్రమ రవాణా దారులను హెచ్చరించారని గుర్తు చేశారు. అయినా మానుకోని వారిని అధికారులు విచారిస్తున్నారని, వాహనదారులపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వారిని కూడా విచారిస్తున్నారు అధికారులు అని వెల్లడించారు. ‘‘ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని సూచించారు. పెన్నా నదిలోకి టిప్పర్లు వెళితే వాటిని సీజ్ చేసి పడేస్తాం. ఒక్కసారి కేసు నమోదు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అక్రమ రవాణా దారులు ఇకనైనా బుద్దిగా ఉండాలి’’ అని JC Prabhakar Reddy హెచ్చరించారు.