అధికారిక చిహ్నమే కనిపించాలి.. సీఎం కీ డెసిషన్

-

రాష్ట్ర మంత్రులు, అధికారులు నిర్వహించే మిడియా సమావేశాల్లో వారి వెనక కనిపించే ఫొటోలు, పేర్లపై సీఎం Chandrababu స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారులు వెనక భాగంలో కేవలం రాష్ట్ర అధికారిక చిహ్నమే(State Official Emblem) కనిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ గుర్తులు, పేర్లు కాకుండా ప్రభుత్వ అధికారిక చిహ్నం కనిపించేలా మీడియా సెంటర్లలో మార్పులు చేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు కూడా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమాచార, పౌర సంబంధాల శాఖ, సచివాలయంలో ఈ మార్పులు చేస్తున్నారు.

- Advertisement -

ఈ మార్పుల్లో భాగంగా చేసిన మార్పుల్లో మీడియా సెంటర్‌లో వెనక గోడపై ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని తెలుగు, ఇంగ్లీషులో రాసి ఉంది. అన్ని జిల్లా కలెక్టరేట్లలోనూ ఇలానే ఉండేలా మార్పులు చేపడుతోంది. ఈ మార్పుల్లో భాగంగా ఎప్పుడూ ఉండే సీఎం ఫొటోను తొలగించారు. కేవలం ప్రభుత్వ అధికారిక చిహ్నమే పెద్దగా కనిపించేలా డిజైన్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో సీఎం ఫొటోతో పాటు.. వైసీపీ జెండాలోని రంగులతో బోర్డులు కూడా ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వీటిలో కూడా మారపులు చేయాలని నిర్ణయించారు. కాగా ప్రభుత్వానికి, పార్టీకి సంబంధం ఉండకూదని, కావున మీడియా సెంటర్లలో అధికారిక చిహ్నమే పెద్దగా కనిపించాలని చంద్రబాబు(Chandrababu) నిర్ణయించారు.

Read Also: స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా.. ఈ ఆహారం తినేయండి..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...

నోరూరించే ఊరగాయలతో ఇన్ని దుష్ప్రభావాలా?

ఊరగాయ పచ్చళ్ల(Pickles) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని తల్చుకుంటేనే...