బాలకృష్ణ 50 ఏళ్ళ సినీ ప్రస్థానం CBN ఆసక్తికర వ్యాఖ్యలు

-

నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 1974 ఆగస్టు 30న తాతమ్మ కల చిత్రంతో ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నేటితో ఇండస్ట్రీలో విజయవంతంగా 50 ఏళ్ళ సినీ కెరీర్ ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బాలకృష్ణ బావ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) కూడా ఆయనకి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు.

- Advertisement -

“ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలయ్య.. ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తూ, నేటి తరాన్ని కూడా అలరించే చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. తండ్రి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలతో పాటు అన్ని జానర్లలో నటించి తానేంటో చాటిచెప్పారు. కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులను సృష్టించి, మరెన్నో మైలురాళ్లను అధిగమించి అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను” అంటూ చంద్రబాబు(Chandrababu) పోస్ట్ చేశారు.

Read Also: కోలీవుడ్‌లో కూడా స్పెషల్ కమిటీ.. వెల్లడించిన విశాల్
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...

నోరూరించే ఊరగాయలతో ఇన్ని దుష్ప్రభావాలా?

ఊరగాయ పచ్చళ్ల(Pickles) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని తల్చుకుంటేనే...