రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదలు కానీ, వాటి వల్ల వాటిల్లుతున్న ప్రాణ నష్టం కానీ ఆగడం లేదు. ప్రతి రోజూ దేశంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఏం చేయాలో అర్థం తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రమాదాలకు కొన్ని చోట్ల మద్యం మత్తు కారణమైతే.. మరికొన్ని సందర్భాల్లో నిద్రమత్తి, నిర్లక్ష్యం ప్రధాన కారణాలవుతున్నాయి. తాజాగా కర్ణాటక(Karnataka)లోని తమకూరు జిల్లా మధుగిరి తాలూకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Karnataka | ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మిగిలిన ఇద్దరు మరో కారులోని వారు. ఐదుగురు మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి, ఒక మహిళ సహా ముగ్గురు పురుషులు ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు.