ధూమపానం.. ఇవాళ రేపు చిన్నచిన్న పిల్లలు కూడా యథేచ్చగా చేసేస్తున్నారు. దీని వల్ల ఎంతో ప్రమాదం ఉందని తెలిసినా ప్రతి రోజూ ఈ మహమ్మారికి బానిసవుతున్నారు. ధూమపానం చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ అలవాటు(Smoking Habit) ఒక్కటి ఉంటే సకల రోగాలు మనకు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ధూమపానం అనే దానికి విరుగుడు ఏమీ లేదని, స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని అంతా చెప్తున్నారు. కాగా ధూమపానం చేయాలన్న కోరికను అధిగమించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ అసలు ధూమపానం చేస్తుంటే అసలు మీ ఆరోగ్యం ఎంత మేర క్షీణించిందో ఎలా తెలుసుకోవచ్చే చూద్దాం. ఇలా తెలుసుకోవడం వల్ల అయినా.. కొందరు ధూమపానం మానేసే అవకాశాలు పెరగొచ్చని కూడా వైద్యులు చెప్తున్నారు.
బ్రోన్కైటిస్.. ధూమపానం చేసేవారిలో కనిపించే అతిసాధారణ వ్యాధుల్లో ఒకటి. ఎంఫిసేమాకు కూడా ధూమపానమే ప్రధాన కారణం. ఎంఫిసెమా అనేది ఊపిరితిత్తుల వ్యాధి. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలనంటే వ్యసనాన్ని తగ్గించుకోవడం ఒక్కటే మార్గమని, అంతే వ్యసనాన్ని తగ్గించుకోవాలంటే ఈ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
గుండె ఎక్స్‌రే.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తెలిపేందుకు సహకరిస్తుంది. అంతే కాకుండా క్రానిక్ అన్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఎంఫిసెమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది.
ఊపిరితిత్తుల CT స్కాన్.. CT స్కాన్, Xరేతో పోలిస్తే ఊపిరితిత్తుల పనితీరును, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఇతర సమస్యలు గుర్తించేందుకు సహకరిస్తుంది.
స్పిరోమెట్రీ.. స్పిరోమెట్రీ ఊపిరితిత్తుల పనితీరును తెలియజేస్తుంది. ధూమపానం అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపించే ఉబ్బసం, COPD వంటి పరిస్థితులు ఊపిరితిత్తుల వ్యాధుల పురోగతిని ట్రాక్ చేసేందుకు సహకరిస్తుంది.
రక్త పరీక్షలు.. సాధారణంగా రక్త పరీక్షలు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో, ధూమపానానికి సంబంధించిన సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి.
- కంప్లీట్ బ్లడ్ కౌంట్.. మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు, రక్తహీనత, రక్తంలో ఇన్ఫెక్షన్లు వంటి పరిస్థితుల్ని గుర్తిస్తుంది.
- లిపిడ్ ప్రొఫైల్.. ధూమపానం చేసే వారిలో పెరిగిన గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుపుతుంది.
- కార్బాక్సీహెమోగ్లోబిన్ స్థాయిలు.. రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిని కొలుస్తుంది. ఇది ధూమపానం చేసేవారిలో ఎక్కువగా ఉంటుంది.
Smoking Habit | ధూమపానం చేసే వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ECG కోసం రెగ్యులర్ స్క్రీనింగ్ లు గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సహాయపడతాయి. హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు ముందుగానే గుర్తించవచ్చు.