లవంగాలు(Cloves).. భారతదేశ వంటకాల్లో తరచుగా వాడే దినుసుల్లో ఒకటి. వీటి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. వీటిని రోజూ తినడం వల్ల మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని, మనకు తరచుగా వచ్చే అనేక రుగ్మతలను లవంగాలు పరిష్కరిస్తాయని, నయం కూడా చేస్తాయని అసలు రోగాలు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయని వైద్యులు చెప్తున్నారు. జలువు, జ్వరం వంటి అనేక సీజనల్ వ్యాధులను తగ్గించడంలో కూడా లవంగాలు కీలకంగా వ్యవహరిస్తాయని, అదే విధంగా మరెన్నో అంతర్గత రుగ్మతలకు కూడా చెక్ పెడతాయని చెప్తున్నారు. మనం తరచుగా మసాలా దినుసుల్లో వాడే ఈ లవంగాలను ఎలా వాడినా లాభాలే ఉంటాయని, ఆఖరికి ఎండిన మొగ్గతో కూడా చాలా లాభాలు ఉన్నాయని, ఎన్నో సమస్యలకు ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు. ఇంతకీ లవంగాలు డైలీ ఆహారంలో తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..
దంతాల ఆరోగ్యం: లవంగాలను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల మన దంతాల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వాటితో పాటు చిగుళ్లు సమస్యలను, దంత సమస్యలను కూడా నివారిస్తుంది. నోటి దుర్వాసను కూడా తగ్గించడంలో ఇవి అద్భుతంగా పని చేస్తాయి.
కాలేయ ఆరోగ్యం: లవంగాల్లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డీటాక్సిఫైయర్‌గా(Detoxification) పనిచేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు సమస్యలను కూడా అద్భుతంగా తగ్గిస్తాయి. తద్వారా కాలేయం దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తుంది.
మొటిమలకు మస్త్ పరిష్కారం: యువతకు తరచుగా బాధించే సమస్య మొటిమలు. వీటిని తగ్గించడంలో లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ లవంగాలు ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గును తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ(Anti Inflammatory) లక్షణాలను అనేక రుగ్మతలను తగ్గిస్తుంది.
బ్లడ్ షుగర్‌కు చెక్: రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను మెయింటెన్ చేయడంలో లవంగాలు దివ్యఔషధాలుగా పనిచేస్తాయి. ప్రతి రోజూ ఆహారంలో లవంగాలను(Cloves) చేర్చడంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తోంది. జీవక్రియ రేటును కూడా అద్భుతంగా పనిచేసేలా చేస్తాయి. ముఖ్యంగా టైప్2 మధుమేహాన్ని తగ్గించడంలో లవంగాలు సూపర్‌గా పనిచేస్తాయి. ఇదే విధంగా మరెన్నో ఔషధగుణాలు లవంగాల్లో ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.