ఆవాలతో అదిరిపోయే ఆరోగ్యం..

-

భారతదేశంలో వంటకం ఏదైనా తాలింపు తప్పకుండా ఉంటుంది. తాలింపు గింజల్లో ఆవాలు(Mustard Seeds) ప్రధానంగా ఉంటాయి. ఎక్కువగా కూడా ఉంటాయి. తాలింపు వేయని ఊరగాయల్లాంటి వాటిల్లో ఆవాల పిండిని కలుపుతారు. ఆవాలు కలవడం వల్ల మన ఆహారానికి మంచి రుచి వస్తుంది. అంతేకాకుండా మనకు అద్భుతమైన ఆరోగ్యం కూడా. ఆవాలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు సమసిపోవడంతో పాటు, మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మన శరీరంలో అతి ముఖ్యమైన గుండె ఆరోగ్యానికి ఆవాలు చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా బీపీని అదుపు చేయడంలోనూ ఆవాలు గొప్పగా పనిచేస్తాయి.

- Advertisement -

ఆవాల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బీపీని కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొవ్వు పెరిగేలా చేస్తాయి. వీటి వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గి గుండె ఆరోగ్యం పెరుగుతంది. గుంబె గుంబనంగా ఉండాలంటే రోజుకో టీస్పూన్‌డ్ ఆవాలు మన ఆహారంలో కలిసేలా చూసుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు.

వాతావరణం మారిందంటే దగ్గు, జలుబు అందరినీ అదరగొట్టేస్తాయి. ఈ దగ్గు, జలుబును తగ్గించే మహత్తర గుణం కూడా ఆవాల సొంతమని చెప్తున్నారు వైద్యులు. మన రోజూ వారి ఆహారంలో ఆవాలు తప్పకుండా ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యానికి ఢోకా ఉండదని, కారే ముక్కుకు గుడ్ బై చెప్పొచ్చని నిపుణులు చెప్తున్నారు.

క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో కూడా ఆవాలు కీలకంగా నిలుస్తాయి. ప్రతి రోజూ ఆవాలు తింటే.. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. దాంతో పాటుగా సోరియాసిస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్, రింగ్ వార్మ్ వంటి చర్మ వ్యాధులను కూడా ఆవాలు దూరం చేస్తాయి.

ఆవాల్లో ఉండే పొటాషియం, కాల్షియం మన ఎముకల బలానికి ఎంతో ఉపయోగపడతాయి. కీళ్లను కూడా బలంగా చేస్తాయి. ఆవాలు తినడం వల్ల కీళ్లనొప్పులు కూడా తగ్గే అవకాశం ఉందని, ఎముకలు కూడా బలంగా తయారవుతాయని వైద్యులు చెప్తున్నారు.

న్యూట్రియంట్స్ కూడా ఆవాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా జట్టును బలంగా మారుస్తాయి. ఆవాల్లోని విటమిన్ ఏ, కే, సీలు వయసు పెరగడం వల్లే ముడతలను తగ్గిస్తాయి. ఏజింగ్ లక్షణాలను కూడా దూరం చేస్తాయని వైద్యులు చెప్తున్న మాట.

ఆవాల్లో ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్, టోకోఫెరోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు మన కాలేయ పనితీరును మెరుగు పరుస్తాయి. వీటితో పాటు రోజూ బాధించే జీర్ణ సమస్యల్ని కూడా ఆవాలు దూరం చేస్తాయి. తద్వారా మలబద్దం వంటి సమస్యలను కూడా ఆవాలు(Mustard Seeds) తగ్గిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

Read Also: టామాటా జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...