ఇసుక మాఫియాకు కాంగ్రెస్ అభయ హస్తం: కేటీఆర్

-

తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నిట్టనిలువుగా తెలంగాణ వాసులను మోసం చేస్తోందంటూ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా పెట్రేగిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వాగుల నుంచి భారీగా ఇసుకను అక్రమంతా తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, గ్రామస్థాయి నేత నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఇసుకను అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఈ ఇసుక మాఫియా(Sand Mafia)కు కాంగ్రెస్ సర్కార్ అభయహస్తం చూపుతుందంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర నలుమూలల్లో ఇసుక మాఫియా దందా విచ్చలవిడిగా సాగుతోందని, ఇందులో బాడా నేత చోటా నేత అన్న తేడా లేకుండా ఇసుకను కాజేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి. మామూళ్లతో అధికారులను మచ్చిక చేసుకుని ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

‘‘ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం..! కాంగ్రెస్ పాలనలో శాండ్ మాఫియా(Sand Mafia)కు అభయ హస్తం..! రాష్ట్రంలో ఏ మూలన చూసినా విచ్చలవిడిగా ఇసుక దందాలు..! బడా ఛోటా తేడా లేదు..మంత్రుల నుంచి మండల స్థాయి లీడర్ల దాకా ఇసుకను పిండి దండిగా ధనాన్ని దండుకుంటున్నారు ! అధికారులకు మామూళ్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటుంటే..ఇక అడ్డగోలు తవ్వకాలను..అక్రమ రవాణాను అడ్డుకునేవాడెవ్వడు..? నదులను..వాగులను…వంకలను కొల్లగొట్టి ఖజానాకు చేరాల్సిన సొమ్మును కాంగ్రెస్ వాళ్ల జేబుల్లో నింపుకుంటున్నారు ! అధికార పార్టీ నేతల అండదండలతో అనధికార తవ్వకాలతో యథేచ్ఛగా అడ్డూ అదుపూలేని ఇసుక దోపిడి సాగుతున్నది..!’’ అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు.

Read Also: రేవంత్ టూర్లపై కేటీఆర్ సెటైర్లు.. పైసా పనిలేదంటూ ట్వీట్..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...