జగన్ పై లోకేశ్ కొత్త పంచులు

జగన్ పై లోకేశ్ కొత్త పంచులు

0
92

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నారాలోకేశ్ సెటైర్స్ వేశారు… జగన్ మోహన్ రెడ్డి పేపర్లో దొరుకుతున్న ఇసుక బయట ప్రజలకు దొరకడం లేదని ఎద్దేవా చేశారు…

ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం అంటూ భారీగా ప్రకటనలు ఇస్తున్నారని జగన్ చెప్పిన టోల్ నెంబర్ నిజంగా పనిచేస్తే మీ పార్టీ ఇసుకాసురుల కోసం పక్క రాష్ట్రం జైళ్లు కూడా అద్దెకు తీసుకోవాలని ఎద్దేవా చేశారు..

వైసీపీ నూతన ఇసుక పాలసీ వలన 50 మంది కార్మికులు బలైయ్యారని లోకేశ్ గుర్తు చేశారు. నిర్మాణ రంగం పడకేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. ఇసుక రేటుని మీ నాయకులు పెంచుకుంటూ పోతున్నారు. మీ పత్రికలో ప్రకటనలకు కోసం వృధా అవుతున్న ప్రజాధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తామని లోకేశ్ అన్నారు