ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ పాలసీ(Drone Policy) తీసుకురావడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి సురేష్ కుమార్(Suresh Kumar) వెల్లడించారు. డ్రోన్ కాన్ఫరెన్స్‌లో రెండు ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒప్పందం జరుగుతోందని, డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ కూడా సర్టిఫైడ్ ఏజెన్సీగా నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అతి త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్ పైలట్ శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, వీటి ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
‘‘తిరుపతి ఐఐటీ(IIT Tirupati)తో నాలెడ్జ్ పాట్నర్‌షిప్ ఎంవోయూ కుదుర్చుకుంటాం. ఈ ఒప్పందం కోసం చాలా సంస్థలు దరఖాస్తు చేస్తున్నాయి. వాటిని అధ్యయనం చేసిన ఓ విధానం ప్రకారం ఒప్పందం విషయంలో ముందడుగు వేస్తాం. డ్రోన్ ఎకో సిస్టమ్ కోసం స్ట్రాటజీ ఫ్రేమ్‌వర్క్ కాన్‌సెప్ట్ పేపర్ విడుదల చేస్తాం. దానిని డ్రోన్ కాన్ఫరెన్స్‌కు వచ్చే ప్రతి ఒక్కరికి అందిస్తాం. సలహాలు స్వీకరించి నెల రోజుల్లోపే డ్రోన్ పాలసీ(Drone Policy)ని అందుబాటులోకి తెస్తాం’’ అని సురేశ్ వివరించారు.