ఏపీ సర్కార్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సర్కార్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

0
79

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యాలు చేశారు… టీడీపీ కార్యకర్తలను తన దగ్గరకు రానివ్వకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు… పశ్చిమ గోదావరి జిల్లాలో మూడురోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు నిన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని పరామర్శించారు…

ఈ రోజు కార్యకర్తలతో సమావేశం అయ్యారు… ప్రస్తుతం వైసీపీ నాయకులు వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆయన ఆరోపించారు… తన నుంచి తమ కార్యకర్తలను దూరం చేసేందుకు కుట్ర పడుతున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు…

అందుకే తనకు పోలీసులు నోటీసులు అందించారని అన్నారు… తన పర్యటన వలన పోలీసు యాక్ట్ 30 పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు… ప్రస్తుతం పోలీస్ అధికారులు లాలూచీ పడి పోస్టింగ్ ల కోసం ఇలా చేస్తున్నారని మండిపడ్డారు..